28, అక్టోబర్ 2009, బుధవారం

ఇదే నా మొదటి బ్లాగులేఖ

రాసాను మీకు చెప్పలేక

ఎదుట పడి మనసు తెలుపలేక!

హాయ్ ఫ్రెండ్స్!


3 నెలలనుండి ట్రయ్ చేస్తున్నా బ్లాగ్ రాయడానికి. కాని ఎలా స్టార్ట్ చెయ్యాలొ తేలీక లేట్ అయ్యింది. ఫస్ట్ ఇంప్రెషన్లోనే బెస్ట్ ఇంప్రెషన్ కొట్టేద్దామని నా దురాశ. హమ్మయ్య ఎలా ఐతే బ్లాగ్ స్టార్ట్ చేసేసా ముందు ముందు ఎలా ఐనా ఉండనీ (అంటే ఇది చదివి ముందు ముందు మీరెలా ఉంటారో అని). పోతే నాకీ దురాలోచన ఎందుకొచ్చింది అంటే నాకు సెల్ఫ్ డబ్బా అంటే చాలా ఇష్టం. మా ఫ్రెండ్స్, కొలీగ్స్ నా సెల్ఫ్ డబ్బా వినీ వినీ ఇంక నేను ఏమి చెపుతున్నా "ఇంక చాల్లే, నువ్వు చాలా డిఫెరెంట్ అంతే కదా" అనటం మొదలెట్టారు (అంటే నెను కొంచెం తేడా అని ఇంగ్లీష్లో చెప్పారన్నమాట). ఇక్కడైతే ఆ ప్రొబ్లెం లేదు కదా. నేను ఎంత రాసినా "ఇంక చాల్లే" అనలెరు కదా. అందుకన్నమాట! (ఒక్క నిమిషం...........ఏంలేదు కూర మాడిపొయ్యింది. పర్లెదులే నేనా కూర ఎలాగూ తినను). ఈసారికి ఇంక చాల్లే. ముందు ముందు నేనేమిటో మీకే తెలుస్తుంది. అంతవరకూ టాటా, బై బై, సీ యూ, హావ్ ఎ నైస్ డే.
యువర్స్ సిన్సియర్లీ

యువర్స్ ట్రూలీ

యువర్స్

లవింగ్లీఎక్సెట్రా ఎక్సెట్రా

శ్రీ