17, నవంబర్ 2009, మంగళవారం

చెట్లు కూడ లివింగ్ తింగ్స్

ఖుషీ సినిమాలో "అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా" పాట వింటుంటే ఒక సంగతి గుర్తుకొచ్చింది. ఏడెనిమిది ఏళ్ళ క్రితం అనుకుంటా మా అబ్బాయి అప్పుడు ఫస్టో సెకండో చదువుతున్నాడు. అప్పటికి నేనింకా జాబ్ చెయ్యటం లేదు. ఎప్పటిలాగే పక్కింటి ఆవిడని వెనుకింటి ఆవిడని పిలిచి ఉప్పర సోది పెట్టి ఉద్యోగం ఆడవాళ్ళకి ఎంత ముఖ్యమో, భర్తలకి తెలీకుండా చీరలు నగలు ఎంత బాగా కొనుక్కోవచ్చో ముప్పైమూడవసారి చెపుతున్నాను. ఇంతలో మా అబ్బాయి పరుగెత్తుకుంటూ వచ్చి "అమ్మా అమ్మా చెట్లు కూడ లివింగ్ తింగ్స్ అని నాకు తెలిసిందమ్మా" అన్నాడు. (అప్పుడు వాడికి స్కూల్ లొ ఆ లెసన్ చెపుతున్నారనుకొంటా). అప్పుడు నేను "మా వాడు ఏదో ఎక్ష్పెరిమెంట్ చేసి కనుక్కుని వుంటాడు, వీడికన్నీ నా తెలివితేటలే వచ్చినై" అని మురిసిపోతూ "ఎలా తెలిసింది నాన్నా" అని అడిగాను. అప్పుడు వాడు "నేను చెట్టు దగ్గర నుంచోని అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా అని పాట పాడుతుంటే చెట్టు ఊగుతుందమ్మా" అని చెప్పాడు. నేను కాసేపు షాక్ తిన్నాను. తరువాత బాగా నవ్వొచ్చింది. ఇంతకీ అవి ఎవరి తెలివితేటలో నాకు అర్థం కాలా. ఆ పాట ఇక్కడ మీకొసం:

http://www.dishant.com/mailsong.php?songid=16723

15, నవంబర్ 2009, ఆదివారం

నేను కొన్నాళ్ళు హైదరాబాద్ లో ఉద్యోగం వెలగబెట్టటానికి వెళ్ళాను పిల్లల్ని విజయవాడ లో అమ్మదగ్గర వదిలేసి. మా ఆఫీస్ టైమింగ్స్ పొద్దున 6 టు 2. సరే సాయంత్రాలు ఎలాగూ ఖాళీ యే కదా. అసలే 10 కేజీలు వెయిట్ ఎక్కువ ఉన్నాను అని ఒక జిం లో జాయిన్ అయ్యాను. ఎ.సి. జిం, మాంచి ఫాస్ట్ మ్యూజిక్. ఒక రోజు డైటిషియన్ కూడ వచ్చింది. అందరికీ డైట్ చెప్పింది. నాకు కూడ చెప్పింది మార్నింగ్ గ్రీన్ టీ, బాదం పప్పులు 8. ఆ తర్వాత 8.30 కి 2 ఎగ్స్, 1 ఫ్రూట్, ఓట్మీల్స్ జావ తీసుకోమంది. "బ్రేక్ ఫాస్ట్ ముందా, బ్రేక్ ఫాస్ట్ తర్వాతా?" అని అడిగాను. ఏమీ మాట్లాడకుండా పైనుంచి కిందకి చూసింది. అర్థమయ్యేటట్లు చెప్తేనే కదా తెలిసేది. ఇంక లాభం లేదని ఒక షీట్ మీద రాసి ఇచ్చింది. ఇంక నేను వెయిట్ తగ్గడం మొదలెట్టాను ఇలా:
ఫస్ట్ మంత్ - 3 కేజీలు

సెకెండ్ మంత్ - 2 కేజీలు

తర్డ్ మంత్ - 1 కేజీ

ఫోర్త్ మంత్ - 1 కేజీ

ఫిఫ్త్ మంత్ - 0.5 కేజీ

సిక్స్త్ మంత్ - 0.5 కేజీ

కేజీ సెవెంత్ మంత్ - నిల్

నిల్ ఎయిత్ మంత్ - నిల్

ఆఫిసువాళ్ళు "ఇంక ఇక్కడ చేసింది చాలు. ఇంటికెళ్ళి చేసుకో" అన్నారు (అంటే హోం-బేస్డ్ ఇచ్చేసారు). నేను ఆనందంగా విజయవాడ వచ్చేసాను. ఇంక నేను వెయిట్ పెరగడం మొదలెట్టాను ఇలా:


ఫస్ట్ మంత్ - నిల్

సెకెండ్ మంత్ - నిల్

తర్డ్ మంత్ - 0.5 కేజీ

ఫోర్త్ మంత్ - 0.5 కేజీ

ఫిఫ్త్ మంత్ - 1 కేజీ

సిక్స్త్ మంత్ - 1 కేజీ

సెవెంత్ మంత్ - 2 కేజీలు

ఎయిత్ మంత్ - 3 కేజీలు


ఇంక వుంటాను. జిం కి టైమయ్యింది.