15, నవంబర్ 2009, ఆదివారం

నేను కొన్నాళ్ళు హైదరాబాద్ లో ఉద్యోగం వెలగబెట్టటానికి వెళ్ళాను పిల్లల్ని విజయవాడ లో అమ్మదగ్గర వదిలేసి. మా ఆఫీస్ టైమింగ్స్ పొద్దున 6 టు 2. సరే సాయంత్రాలు ఎలాగూ ఖాళీ యే కదా. అసలే 10 కేజీలు వెయిట్ ఎక్కువ ఉన్నాను అని ఒక జిం లో జాయిన్ అయ్యాను. ఎ.సి. జిం, మాంచి ఫాస్ట్ మ్యూజిక్. ఒక రోజు డైటిషియన్ కూడ వచ్చింది. అందరికీ డైట్ చెప్పింది. నాకు కూడ చెప్పింది మార్నింగ్ గ్రీన్ టీ, బాదం పప్పులు 8. ఆ తర్వాత 8.30 కి 2 ఎగ్స్, 1 ఫ్రూట్, ఓట్మీల్స్ జావ తీసుకోమంది. "బ్రేక్ ఫాస్ట్ ముందా, బ్రేక్ ఫాస్ట్ తర్వాతా?" అని అడిగాను. ఏమీ మాట్లాడకుండా పైనుంచి కిందకి చూసింది. అర్థమయ్యేటట్లు చెప్తేనే కదా తెలిసేది. ఇంక లాభం లేదని ఒక షీట్ మీద రాసి ఇచ్చింది. ఇంక నేను వెయిట్ తగ్గడం మొదలెట్టాను ఇలా:
ఫస్ట్ మంత్ - 3 కేజీలు

సెకెండ్ మంత్ - 2 కేజీలు

తర్డ్ మంత్ - 1 కేజీ

ఫోర్త్ మంత్ - 1 కేజీ

ఫిఫ్త్ మంత్ - 0.5 కేజీ

సిక్స్త్ మంత్ - 0.5 కేజీ

కేజీ సెవెంత్ మంత్ - నిల్

నిల్ ఎయిత్ మంత్ - నిల్

ఆఫిసువాళ్ళు "ఇంక ఇక్కడ చేసింది చాలు. ఇంటికెళ్ళి చేసుకో" అన్నారు (అంటే హోం-బేస్డ్ ఇచ్చేసారు). నేను ఆనందంగా విజయవాడ వచ్చేసాను. ఇంక నేను వెయిట్ పెరగడం మొదలెట్టాను ఇలా:


ఫస్ట్ మంత్ - నిల్

సెకెండ్ మంత్ - నిల్

తర్డ్ మంత్ - 0.5 కేజీ

ఫోర్త్ మంత్ - 0.5 కేజీ

ఫిఫ్త్ మంత్ - 1 కేజీ

సిక్స్త్ మంత్ - 1 కేజీ

సెవెంత్ మంత్ - 2 కేజీలు

ఎయిత్ మంత్ - 3 కేజీలు


ఇంక వుంటాను. జిం కి టైమయ్యింది.

1 కామెంట్‌:

  1. ఇలా తగ్గుతూ, పెరుగుతూ,తగ్గుతూ, పెరుగుతూ........ అలా అలా మరో 3 టపాలు రాయండి. అవి చదవలేక మేము వేగంగా పరిగెత్తుతూ బరువు తగ్గుతాము. Just kidding. ఇలాగే సరదాగా రాయండి.

    రిప్లయితొలగించండి